విశాలాంధ్ర ధర్మవరం : చిత్తూరు జిల్లాలోని తిరుమల పుణ్యక్షేత్రంలో రథసప్తమి సందర్భంగా బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎస్బిఐ కాలనీకి చెందిన మానస నోకియా కళాకేంద్రం బృందం వారు ఆలపించిన పాటలు, వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మానస నృత్య కళా కేంద్రం గురువు మానస మాట్లాడుతూ తిరుమలలో ఇటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందడం జరిగిందని అందుకే ఈనెల నాలుగవ తేదీన తిరుమలలో ప్రదర్శన ఇవ్వడం జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువు మానస వెంకటేశ్వర స్వామి వేషధారణలోనూ కృష్ణ అన్నమయ్య వేషధారణ అందర్నీ అలరారించాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 25 మంది శిష్య బృందం పాల్గొనడం జరిగిందని తెలిపారు. తదుపరి బృంద నాట్యంతో పాటు కోలాట ప్రదర్శనలతో కూడా తాము నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వామివారి ఆశీర్వాదంతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని తిరుమల దేవస్థానం వారు మాకు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
తిరుమలలో ఆకట్టుకున్న ధర్మవరం మానస నృత్య కళాకేంద్రం ప్రదర్శన
RELATED ARTICLES