విశాలాంధ్ర ధర్మవరం;; వాతావరణ పరిస్థితుల్లో సాగు చేస్తున్న పంటలను జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు సనావుల్లా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని బడన్నపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేయడం జరిగింది అన్నారు. రైతులు పై పాటుగా కాంప్లెక్సు ఎరువులు వాడ రాదని,అలాగే వేరుశనగ పంట పూత దశలో జిప్సం ఎకరాకు 200 కేజీలు వేసుకోవాలని సూచించడం జరిగింది అన్నారు. పురుగుల ఉధృతి బట్టి మాత్రమే పురుగు మందులు పిచికారి చేసుకోవాలని, అనవసరమంగా అధిక మోతాదులు వాడరాదని, దీనివల్ల మనుషుల ఆరోగ్యము , నేల ఆరోగ్యము దెబ్బతింటుంది అని, పెట్టుబడి ఖర్చు అధికమవుతుందని రైతులకు సూచించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, ఏఈఓ అశ్విని, గ్రామ పట్టు సహాయకులు కమ్మన్న, గ్రామ రైతులు పాల్గొన్నారు
పంటలను పరిశీలించిన జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు
RELATED ARTICLES