ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ కు వినతి పత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజే నాయకులు
విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జర్నలిజం కోర్సులు పునః ప్రారంభించాలని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పద్మశ్రీ కు వినతి పత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల లో బి ఏ కోర్సు లో జర్నలిజం సబ్జెక్టును కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా కమిటీ వినతి పత్రం అందజేశామన్నారు. అన్ని సబ్జెక్టుల మాదిరిగా కళాశాలలో జర్నలిజం సబ్జెక్టు కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్య విధానంలో భాగంగా మేజర్, మైనర్ సబ్జెక్టుల ఆప్షనల్ విధానంలో విద్యార్థులు జర్నలిజం సబ్జెక్టును తీసుకునేలా శాశ్వతంగా ప్రధానమైన సబ్జెక్టుగా భావించి ( మేజర్) ఎంచుకొనే ప్రక్రియను కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకముందు జర్నలిజం సబ్జెక్టుని ఎట్టి పరిస్థితుల్లో తీసేయకుండా కొనసాగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా డిగ్రీ స్థాయిలో జర్నలిజం సబ్జెక్టు లేనందున ఇక్కడ ఉన్న దానికి మీరు ప్రాధాన్యత కల్పించి జర్నలిజం శాస్త్రాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఇకపై జర్నలిజం సబ్జెక్టును తొలగించే ప్రక్రియ ఏదైనా జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ రాబోయే అకాడమిక్ లో పునః ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి సి హెచ్. చౌడప్ప, జిల్లా సహాయ కార్యదర్శి పి. చలపతి, జిల్లా ఈసీ మెంబర్స్ ఎల్. మల్లికార్జున, బిల్లే అక్కులప్ప, తదితరులు పాల్గొన్నారు.