: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మున్సిపాలిటీ సమస్యలు అంశంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ప్రజలకు సూచనలు, సలహాలు అందజేశారు. వీటన్నింటినీ పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఒక వారం విడిచి మరొక వారం గురువారం (ఆల్టర్నేట్ వీక్ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ సమస్యలపై 13 మందితో మాట్లాడడం జరిగిందని, రోడ్లు, కాలువలు, విధి దీపాలు, ఇంటి పన్నులకు సంబంధించి, ఆస్తులు పంపకాలకు సంబంధించి తదితర సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడడం జరిగిందని, వారి సమస్యలను తెలుసుకొని తగు సూచనలు సలహాలను అధికారులకు ఇవ్వడం జరిగిందని, తదుపరి జరగబోయే ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సంబంధించిన సమస్యలపై నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగాన్ని చురుగ్గా పెట్టే విధంగా చూస్తున్నామని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత లాభం చేకూర్చి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని తీర్చే విధంగా తోడ్పడతాయని, అలాగే వేగవంతంగా సమస్యలను పరిష్కారం చేసే విధంగా తోడ్పడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా పరిషత్ సీఈవో ఆర్.రామచంద్రారెడ్డి, డైరెక్టర్ ఆకాశవాణి అనంతపురం నాగేశ్వరరావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు..