10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రు.84,990
వారం రోజుల్లో రూ.5 వేలు పెరుగుదల
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో పాటు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పసిడి ధరలు పైపైకి వెళుతున్నాయి. ధరలు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయికి చేరుతున్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో ప్రజలు ఏమాత్రం తగ్గడం లేదు. గత వారం రోజుల్లోనే ఏకంగా ఐదు వేల రూపాయలకు పైగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 80వేల లోపు ఉన్న పసిడి ధరలు ఇప్పుడు 85వేలు దాటి దూసుకుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవేళ (శనివారం) ఉదయం సంబంధిత బులియన్స్.కో.ఇన్ వెబ్ సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి రేటు రూ.84,710కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.77,651కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ.84,990గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.77,908కి చేరుకుంది.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పసిడి ధరలు పైపైకి…!
RELATED ARTICLES