ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిటాల శ్రీరామ్, హరీష్ బాబు, చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మార్కెట్ వీధిలో గల మార్కండేయ స్వామి దేవాలయంలో భద్రావతి భావన రుసింద్రుల స్వామివారి 59వ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈనెల ఆరవ తేదీ నుండి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ రోజు స్వామివారికి విశేష పూజలతో పాటు భద్రావతి భావన రుచేంద్రుల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ ఉభయ దాతలైన 81 మందిని ఆలయ కమిటీ వారు వారి పేరిటన అర్చనలు నిర్వహించి, ఘనంగా సన్మానించారు. అనంతరం ధర్మవరం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి లు కూడా కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరై, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పుత్తా రుద్రయ్య, ప్రధాన కార్యదర్శి మేటీకల బాల కుళ్లాయప్ప, ఉపాధ్యక్షులు జింక నాగభూషణ, కోశాధికారి వాడుకల భాస్కర్, సహాయ కార్యదర్శులు పోలంకి వెంకటరామయ్య, పోలంకి లక్ష్మీనారాయణ ,బుధారపు శ్రీనివాసులు, సమన్వయ కమిటీ సభ్యులు కుంటూ మల్ల నారాయణ ఆర్వేజి లక్ష్మీకాంతం నాగమల్లి వెంకట స్వామి తో పాటు డైరెక్టర్లు కార్యనిర్వాహక సభ్యులు సహాయ కార్యదర్శులు ఉపాధ్యక్షులు భక్తాదులు, దాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఘనంగా శ్రీ బద్రావతి శ్రీ భావన రుషింద్రుల స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
RELATED ARTICLES