Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిటాలెంట్ టెస్ట్ లో స్టేట్ ప్రథమ ర్యాంకు సాధించిన బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు…

టాలెంట్ టెస్ట్ లో స్టేట్ ప్రథమ ర్యాంకు సాధించిన బిఎస్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు…

హెడ్మాస్టర్ రాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; ఎడ్యుకేషన్ ఏపీ పని మెరిట్ టాలెంట్ టెస్ట్ -2025 లో రాష్ట్ర ప్రధమ ర్యాంకును శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక సంఘ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని హెడ్మాస్టర్ రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ విధానంలో జరిగిన ఎడ్యుకేషన్ ఏపీ పని మెరిట్ టెస్ట్-2025(ఈఈఎంటి) నందు ఏడవ తరగతి విభాగంలో దాసరి లలితేష్, పదవ తరగతి విభాగంలో ఉక్కిసల ఓబులేశులు రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించడం జరిగిందని తెలిపారు. ఈనెల 8వ తేదీన విజయవాడలో జరిగిన ర్యాంకుల ప్రధాన సభలో వీరికి రాష్ట్ర సీమార్ట్ డైరెక్టర్ మస్తానయ్య కోడ్ తంత్ర అధినేత రమణా చేతుల మీదుగా మెమెంటో తో పాటు సర్టిఫికెట్ 30 వేల రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ రాంప్రసాద్ తో పాటు ఉపాధ్యాయుడు ప్రదీప్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు