Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేకాట రాయులు అరెస్ట్.. నగదు స్వాధీనం.. డి.ఎస్.పి.. హేమంత్ కుమార్

పేకాట రాయులు అరెస్ట్.. నగదు స్వాధీనం.. డి.ఎస్.పి.. హేమంత్ కుమార్

విశాలాంధ్ర ధర్మవరం;; రాబడిన సమాచారం మేరకు పట్టణములోని గుడ్ సెట్ కొట్టాల ప్రాంతంలో శంకర్ రెడ్డి స్కూల్ వద్ద ఆకస్మిక దాడులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ శోధనలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.27,320 రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగిందని డి.ఎస్.పి హేమంత్ కుమార్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ లో విలేకరులకు తెలిపారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ ధర్మవరం సబ్ డివిజన్లో అసాంఘిక కార్యకలా పాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, గ్యాంబ్లింగ్ పై ఉక్కు పాదం నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిధిలో గ్యాంబ్లింగ్ మట్కా,ఇతర అక్రమ కార్యకలాపాలపై ఇకనుంచి నిరంతర కట్టుదిట్టమైన నిఘా ఉంచుతామని తెలిపారు. కావున పట్టణ ప్రజలందరూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆసక్తి చూపకుండా చట్టాన్ని గౌరవిస్తూ చట్టపరిధిలో అందరూ జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్, కానిస్టేబుల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు