అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని జయప్రదం చేయాలని బంజారా గిరిజన సమాఖ్య నియోజకవర్గ ఇన్చార్జ్ ముడావత్ రాంబాబు నాయక్ పిలుపు ఇచ్చారు. పట్టణంలోని బంజారా గిరిజన సమాఖ్య కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 13,14,15వ తేదీలలో బంజారాల కాశీ సేవా గడ్లో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను బంజారాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని, బంజారా చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోని, తమ గ్రామాలలో తెలియని వారికి తెలియజెప్పి సేవాలాల్ మహారాజ్ చరిత్రను విస్తరింప చేయాలన్నారు. సేవా గడ్ కు బంజారా అతిరథ మహానుభావులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బంజారాలను కోరారు.