అనంతపురం జిల్లా విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని అమ్మవారిశాలలో వాసవి క్లబ్ కే.సి.జి.ఎఫ్ ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్ష మెగా శిబిరము చేసినట్లు వాసవి క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం షుగర్ పరీక్ష శిబిరం ఏర్పాటు చేశామని, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి.శ్రీవాణి పర్యవేక్షణలో, ప్రముఖ ల్యాబ్ వారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహించామన్నారు. ఈ పరీక్ష శిబిరంలో 45 మందికి షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కేసిజిఎఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ క్లబ్ జోన్ వన్ చైర్ పర్సన్ అచ్యుత నాగేంద్ర గుప్త వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కాసంశెట్టి శ్యాం ప్రసాద్ సెక్రెటరీ కొప్పరపు కుమార ట్రెజరర్ జైనీ శేషపణి, వి209ఎ డిస్టిక్ గవర్నర్ కందూరు సుబ్బరామయ్య ఐ.ఈ.సి. ఆఫీసర్ భూమా సూర్యనారాయణ వాసవి క్లబ్ కె.సి.జి.ఎఫ్ ఫ్యామిలీస్ అడ్వైజర్ వంకధార పెద్ద మద్దిలేటయ్య వాసవి క్లబ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు.