Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సకల రాజా ఎంపిక

ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సకల రాజా ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ధర్మవరం పట్టణానికి చెందిన సకల రాజాను ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేయడం జరిగిందని సకల రాజా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం లో(ఈనెల 7,8,9 తేదీలలో) జరిగిన ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల కార్యక్రమంలో పలు కమిటీలను ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా సకల రాజా అను నన్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. నాపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు జిల్లా నాయకులు పాల్గొనడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు