Saturday, May 10, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ శాఖల్లోని దోబీ ఉద్యోగాలు రజకులకే కేటాయించాలి

ప్రభుత్వ శాఖల్లోని దోబీ ఉద్యోగాలు రజకులకే కేటాయించాలి

చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామాంజనేయులు డిమాండ్

విశాలాంధ్ర అనంతపురం : ప్రభుత్వ శాఖల్లోని దోబీ ఉద్యోగాలు రజకులకే కేటాయించాలని చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య సమావేశాన్ని మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సి.వి. హరికృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఏపీ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామాంజనేయులు, ఏపీ చేతి వృత్తిదారుల రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు సి. లింగమయ్య, చేతివృత్తిదారుల సమాఖ్య నాయకులు, మత్స్యకారుల రాష్ట్ర నాయకులు నాగాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు మాట్లాడుతూ… రైల్వే డిపార్ట్మెంట్, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి దోబీలకు కేటాయించకుండా కార్పొరేట్ సంస్థ కాంట్రాక్ట్లకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ధోబి ఉద్యోగాలను రజకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై అందరూ సమైక్యంగా ఉంటూ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎస్సీల్లో చేర్చడం జరిగిందన్నారు. చేతివృత్తిదారులను రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేర్చాలన్న ప్రధాన డిమాండ్ ను రజక సోదరులు ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రజకులు వృత్తి నైపుణ్యంతో ఈ సమాజాన్ని శుభ్రపరచడంలో రజకులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అన్నారు. రిజర్వేషన్ తో నిమిత్తం లేకుండా రజక వృత్తిదారుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఆరోగ్య సంరక్షణ చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని పేర్కొన్నారు. రజకులపై దాడులను ఖండిస్తు వారికి రక్షణ కల్పిస్తూ సామాజికంగా భద్రత చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 28 రంగాల్లో చేతివృత్తుదారులు ఉన్నారని సేవా కార్యక్రమాల్లో రజకులు ఉండగా, నాయి బ్రాహ్మణులు, వాయిద్య కారులు, గొర్రె కాపర్లు, స్వర్ణకారులు ఇతర వృత్తిదారులు ఉన్నారన్నారు. రజకులకు కేటాయించిన భూములు, దోబీ ఘాట్ లు భూకబ్జాలకు గురి అవుతున్నాయి అన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని రెవెన్యూ, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమస్యల పట్ల చేతివృత్తిదారుల సమాఖ్య సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా నాయకులు నాగప్ప,నాగరాజు, నారాయణప్ప,భూషణ, వీరాంజి, జయరాం,ఓబుల్,రాయుడు, బికేస్ మాజీ ఉపసర్పంచ్ లలిత, చిన్నహుస్సేన్, అప్ప రంగయ్య పాపన్న, ఆదినారాయణమూర్తి, పెద్దన్న పెద్ద బయన్న,నాగేంద్ర, ఆదినారాయణ, ముత్యాలు, సంజీవులు, ఓన్నూరప్ప,గొర్ల మేకల పెంపకదారులు సంఘం రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య, గీత పని వాళ్ళ సంఘం జిల్లా కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు