విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. గోపాల్ నాయక్ అధ్వర్యంలో, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.ఎస్.చిట్టెమ్మ అధ్యక్షతన “ఆల్బెండ జోల్” మాత్రల పంపిణీ కార్యక్రమం జరిగింది. డా. ఎస్. చిట్టెమ్మ మాట్లాడుతు జాతీయ నులి పురుగుల నివారణను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యవంతమైన 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ నెల 10 నుండి 17వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. కావున అందరు ఇటువంటి అవకాశాన్నిసక్రమంగా సద్వినియోగిoచుకొని ప్రతి ఒక్కరు ఈ మాత్రలు ను వాడాలని, తమకుటుంబ సభ్యులను అందజేయాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో డా. ఎఎస్ షమీవుల్లా, డాక్టర్ ఎస్. పావని,డా. బి. త్రివేణి, ఎ.కిరణ్ కుమార్, యం. భువనేశ్వరి, యం. పుష్పావతి, యం సరస్వతి, బి. ఆనంద్, మీనా, ధనుంజయులు తదితర బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
కె హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “ఆల్బెండ జోల్” మాత్రల పంపిణీ
RELATED ARTICLES