Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

విశాలాంధ్ర – న్యూ ఢిల్లీ: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏరో ఇండియా-2025లో యుద్ధ విమానాన్ని మంగళవారం నడిపారు. దాని అనుభవం గురించి పంచుకున్నారు. ఏరో ఇండియా-2025 సందర్భంగా యుద్ధ విమానం నడపడం మరచిపోలేని అనుభూతిని కలిగించిందని అన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్వదేశంలో గర్వంగా రూపొందించిన హెచ్‌జేటీ-36 ఃయశస్ః జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందని ఆయన తెలిపారు. విమానయాన మరియు రక్షణ రంగంలో భారతదేశం సాధిస్తున్న అభివృద్ధికి ఈ స్వదేశీ విమానం నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఃఆత్మనిర్భర్ భారత్ః లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు