దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ
జొహనెస్‌బర్గ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలను, బెదిరింపులను దక్షిణాఫ్రికా కమ్యూనిస్టులు ఆక్షేపించారు. తమ దేశాన్ని ట్రంప్ హెచ్చరించడాన్ని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ (ఎస్‌ఏసీపీ) ఖండిరచింది. దేశ జాతీయ సమగ్రతను పరిరక్షణకు కట్టుబడతామని పేర్కొంది.అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ట్రంప్ అజెండాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఓ స్వతంత్ర ప్రజాస్వామ్యమని, సార్వభౌమత్వంగల దేశమని, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉంటుందని కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా సహా విదేశీ జోక్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పింది. రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ముందుకెళతామని, పేర్కొంది. ఎక్స్‌ప్రోప్రియేషన్ చట్టం రద్దుపై ట్రంప్ వైఖరిని ఖండిరచింది. ‘ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు తప్ప దక్షిణాఫ్రికాకు కాదు. దక్షిణాఫ్రికా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ జోక్యాన్ని సహించబోం. మా దేశ ప్రజాస్వామిక జాతీయ సమగ్రతను తక్కువ చేయడాన్ని, మా ప్రజలపై తన అభిప్రాయాలు రుద్దేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అనుమతించబోం. మేము మా స్వాతంత్య్రాన్ని పోరాడి సాధించుకున్నాం. వివక్షపూరిత పాలన, అజెండాలు ప్రతిఘటిస్తాం. ట్రంప్ వ్యాఖ్యలు వివక్షపూరిత. దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై ఆయనవి తప్పుడు ఆరోపణలు. వలసవాదాన్ని మాపై రుద్దాలనుకునే ట్రంప్ యత్నాలు సాగనివ్వం’ అని కమ్యూనిస్టు పార్టీ తన ప్రకటనలో తేల్చి చెప్పింది. ‘దక్షిణాఫ్రికా… ఇక్కడ ఉండే ప్రజలది. సామ్రాజ్యవాద బెదిరింపులకు తలొగ్గేది లేదు. మా పోరాటం ఆగదు!’ అసి దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ పునరుద్ఘాటించింది.
ట్రంప్ బెదిరింపులకు తలొగ్గబోం
RELATED ARTICLES