Monday, February 24, 2025
Homeబోగస్‌ పెన్షన్ల ఏరివేత !

బోగస్‌ పెన్షన్ల ఏరివేత !

. ఇళ్ల స్థలాలపైనా ఆరా
. రంగంలోకి అధికారులు
. 15లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అనర్హత దివ్యాంగుల పెన్షన్ల ఏరివేతకు, అనర్హులకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్లు, స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడిరది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశిం చింది. ఐదు రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 15లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అర్హులం దరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా… ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారనే విషయంపై సర్వేకు అధికా రులు సిద్ధమయ్యారు. ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయి… అందులో అనర్హులు ఎవరనే విషయంపై తనిఖీలు చేపడతున్నారు. సర్వేకు సంబంధించిన ఓ చెక్‌లిస్ట్‌ ఫార్మాట్‌ను ప్రభుత్వం కలెక్టర్లకు పంపింది. దీంతో ఆయా అంశాల వారీగా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టనున్నారు. గతంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమంది ఇంట్లో ఇద్దరు, ముగ్గురికీ ఇళ్ల పట్టాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. చాలామంది పట్టాలు పొంది స్థలాలను ఇతరులకు అమ్మేశారన్న విమర్శలున్నాయి. అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులు ఇచ్చే సర్వే నివేదిక అధారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అర్హులందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుంది. దీనిపై కొంతవరకు విధి విధానాలు రూపొందించింది. దానికంటే ముందుగా గత ప్రభుత్వ హయాంలో అనర్హుల ఏరివేతపై దృష్టి పెట్టింది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా బోగస్‌ పెన్షన్ల ఏరివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బోగస్‌ సదరం సర్టిఫికెట్ల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన వారికే పెన్షన్లు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారిని గుర్తించి… ఏరివేత చర్యలకు ఉపక్రమించింది. గుంటూరుతోపాటు అనేక జిల్లాల్లో దీనిపై సర్వే చేపట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 264 మంది పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులున్నారు. వారిలో దీర్ఘకాలిక వ్యాధులకు గురై నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన వారున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతినెలా రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వగా… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.15 వేలకు పెంచింది. ఇందులో కొందరు బోగస్‌ పెన్షన్‌దారులున్నారని తేలడంతో నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్‌ పొందుతున్న వారిపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం దివ్యాంగుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. వారందర్నీ రోజుకు 100 మంది చొప్పున అనంతపురం సర్వజన ఆస్పత్రికి పిలిపించి ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలను ఇళ్ల వద్ద పరిశీలించాలని దివ్యాంగులు కోరుతున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ దివ్యాంగులపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు