Tuesday, February 25, 2025
Homeఆంధ్రప్రదేశ్నేటి నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన

నేటి నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన

హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శన‌
ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ద దేవాలయాలను దర్శించనున్న జ‌న‌సేనాని
మూడు రోజుల ఈ యాత్రలో ఏడు క్షేత్రాలను సందర్శన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళలోని కొచ్చిన్ కు బయల్దేరి వెళ్లారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు. ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాలను జ‌న‌సేనాని దర్శించుకోనున్నారు. ఇక మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్‌ సందర్శిస్తారని ఆయన టీమ్‌ వెల్లడించింది. అలాగే గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా తీర్చుకోనున్నారని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ ముందే ఫిక్స్ చేసినా.. జ్వ‌రం కార‌ణంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు