విశాలాంధ్ర ధర్మవరం:: ఆల్బెండజోల్తో కడుపులోని నులిపురుగులను నివారించవచ్చునని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే .హర్షవర్ధన్, కళాశాల ఇన్చార్జ్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా రేగాటిపల్లి రోడ్డు లో గల వీరి కళాశాలలో నులిపురుగుల నివారణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థినీలకు మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం పట్టణంలో 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఏఎన్ఎం తెలిపారు.19 సంవత్సరాల లోపు వయసు ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఈ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. శుభ్రమైన నీరు తాగాలని మూత కప్పి ఉంచిన ఆహారాన్ని భుజించాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆల్బెండజోల్తో నులిపురుగులకు చెక్..
RELATED ARTICLES