Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది..

రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది..

ఆర్టీసీ డిఎం సత్యనారాయణ

జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పోలా ప్రభాకర్

విశాలాంధ్ర ధర్మవరం : రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ, జిల్లా రెడ్క్రాస్ ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఆధ్వర్యంలో డిపో ఆవరణములో రక్తదాన శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరానికి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ, స్థానిక యువర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సహాయ సహకారాలతో సమన్వయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు కన్ను అతి ముఖ్యమైన భాగము అని, ప్రయాణికులను సుఖవంతంగా చేర్చడానికి, కన్ను అతి ప్రధానమైనదని తెలిపారు. రోడ్డు భద్రత మాసొస్తవాల భాగంగా ఈ రక్తదాన శిబిరమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా డ్రైవర్లకు రక్తదానము పై అవగాహన కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి డ్రైవరు కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలపడం జరిగిందని తెలిపారు. తదుపరి శ్రీ సత్యసాయి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి విశ్వనాథ్, జిల్లా కోఆర్డినేటర్ రమేష్, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థలు రక్త సేకరణ అనే కార్యక్రమం అతి ముఖ్యమైనదని, రక్తదానంపై తాము ఇప్పటికే పలుచోట్ల ప్రజలకు యువతి యువకులకు అవగాహన సదస్సును కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 22 మంది ఆర్టీసీ సిబ్బంది రక్తదానం చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రతి శిబిరంలో రెడ్ క్రాస్ సంస్థతో పాటు స్థానికంగా ఉన్న యువర్స్ ఫౌండేషన్ వారితో కూడా సమన్వయంతో తాము సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను డాక్టర్. నరసింహులు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్చార్జ్ శ్రీరాములు, గ్యారేజీ ఇంచార్జ్ సికిందర్,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు