Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరేగాటి పల్లెలో అక్రమంగా పట్టాలు పొందిన వారిపై చర్యలు గైకొనండి..

రేగాటి పల్లెలో అక్రమంగా పట్టాలు పొందిన వారిపై చర్యలు గైకొనండి..

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రేగాటి పల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో వైసిపి నాయకులు దౌర్జన్యంగా అక్రమంగా ఆన్లైన్లో పొందుపరిచి పట్టాలు పొందడం జరిగిందని, అటువంటి వారిపై చర్యలు గైకొనాలని కోరుతూ ఆర్డిఓ మహేష్ కు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వినతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాములో కేవలం రేగాటి పల్లె గ్రామమే కాకుండా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అక్రమాలకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు వైఎస్ఆర్సిపి నాయకులు తమ పలుకుబడి ఉపయోగించుకొని లబ్ధిదారులకు అన్యాయం చేయడం జరిగిందని ఆర్డిఓకు వివరించడం జరిగిందని తెలిపారు. కావున ఆక్రమణకు గురైన భూములపై విచారణ చేపట్టి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు గైకొనాలని వారు తెలిపారు. స్పందించిన ఆర్డిఓ మాట్లాడుతూ తాను తాసిల్దార్ ద్వారా విచారణ చేపట్టి న్యాయం చేకూర్చుతానని హామీ ఇవ్వడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు