Thursday, February 27, 2025
Homeజిల్లాలుఅనంతపురందేవాంగ కళ్యాణమండపం నూతన అధ్యక్షులుగా కటికం మల్లేష్

దేవాంగ కళ్యాణమండపం నూతన అధ్యక్షులుగా కటికం మల్లేష్

విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా : గత అనేక రోజులుగా వివాదాస్పదమవుతూ వస్తున్న ఉరవకొండ దేవాంగ సంక్షేమ సంఘం కళ్యాణ మండపం అధ్యక్షుని ఎన్నిక ఎట్టికెలకు బుధవారం స్థానిక దేవాంగుల కళ్యాణమండపంలో దేవాంగ కుల పెద్దమనుషుల కమిటీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఏకగ్రీవంగా కటికం మల్లేష్ ను నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం కుల పెద్దలు అయినా చిట్టా శ్రీధర్, కొమ్మసాని బాలచంద్ర, నున్న రంగనాయకులు ఎం సి నాగభూషణం, మిడతల చంద్రమౌళి మాట్లాడుతూ నూతన అధ్యక్షుడు మరియు పాలకవర్గం సభ్యులు కళ్యాణ మంటపం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కుల సోదరులు మరియు పెద్దలు అభిప్రాయాలను సలహాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి వైపు నడిపించాలని పేర్కొన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన కటకం మల్లేష్ ను పలువురు దేవాంగ సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కుల సోదరులు నిమ్మల ప్రసాద్ రెడ్డి నాగరాజు, కొత్త మురళీకృష్ణ, చిట్టా రఘు, ఆర్.సి ప్రసాద్, డోనపర్తి ప్రతాప్, మరియు కుల సోదరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు