విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు, గురువు షిండే చిదంబర రావుకు బొంబాయిలో ఇటీవల అతని ప్రదర్శనకు ఘన సత్కారం లభించింది. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ ఇటీవల బొంబాయి లోని కేటీ ఏరియాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి తోలుబొమ్మలాట కళాకారుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఈ ప్రదర్శనలో తనతో పాటు 8మంది కళాకారులు తోలు ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రదర్శించిన మా తోలుబొమ్మలాట అందరిని విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. తాను 48 సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళాకారుడుగా, గురువుగా ఉంటున్నానని, భారత దేశము, ఇతర దేశాలైన లండన్, జర్మనీ, స్పెయిన్, ఈజిప్ట్, మెక్సికో, ప్యారిస్, ఫ్రాన్స్, ఉమెన్ మస్కట్ దేశాలలో నా ప్రదర్శన నిర్వహించడం గర్భంగా ఉందని, భారతదేశ సంస్కృతి కళలనుచేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. భారతదేశ ప్రధాని మోడీతో కూడా తాను ప్రశంసలు అందుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కళాకారులను మరింత ఆదుకునే దిశలో చర్యలు చేపట్టాలని తెలిపారు.
తోలుబొమ్మలాట కళాకారుడుకు ఘన సత్కారం..
RELATED ARTICLES