గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్సంగ్, భారతదేశంలో అత్యంత సరసమైన 5జి స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్06 5జిని విడుదల చేసినట్లు వెల్లడిరచింది. అధిక-పనితీరు మరియు శైలి పరిపూర్ణ మిశ్రమంతో 5జి విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి గెలాక్సీ ఎఫ్06 5జి సిద్ధంగా ఉంది. గెలాక్సీ ఎఫ్06 5జి సరసమైన ధరకు పూర్తి 5జి అనుభవాన్ని అందిస్తుంది. 5జి సాంకేతికతను ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. దేశవ్యాప్తంగా దాని విస్తృత స్వీకరణను వేగవంతం చేస్తుంది. గెలాక్సీ ఎఫ్06 5జి దేశంలో టెలికాం ఆపరేటర్లలో 12 5జీ బ్యాండ్లకు మద్దతు ఇస్తుంది.