Saturday, February 15, 2025
Homeవ్యాపారంటాటా ఏఐజీ ‘విత్‌ యు లైక్‌ ఫ్యామిలీ, విత్‌ యూ ఆల్వేస్‌’ క్యాంపెయిన్‌

టాటా ఏఐజీ ‘విత్‌ యు లైక్‌ ఫ్యామిలీ, విత్‌ యూ ఆల్వేస్‌’ క్యాంపెయిన్‌

ముంబై: ప్రతి కుటుంబంలోను అంతర్గతంగా ఉండే ప్రేమ, సంరక్షణతో కూడుకున్న బంధాన్ని ఆవిష్కరించేలా ‘విత్‌ యూ లైక్‌ ఫ్యామిలీ, విత్‌ యూ ఆల్వేస్‌’ పేరిట భారతదేశపు దిగ్గజ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ టాటా ఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తమ తాజా బ్రాండ్‌ క్యాంపెయిన్‌ను ప్రవేశపెట్టింది. పైకి చెప్పకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన వారు మనకు జీవితంలోని అన్ని దశల్లోనూ వెంట ఉంటారనే ఒక భరోసా భావాన్ని వ్యక్తపర్చేలా ఈ ప్రచార కార్యక్రమం ఉంటుంది. జీవితంలోని వివిధ దశల్లో ‘తండ్రి’, ‘కుమారుడి’ మధ్య బంధాన్ని ఇది ఆవిష్కరిస్తుంది. టీబీడబ్ల్యూఏ రూపొందించిన ఈ క్యాంపెయిన్‌, జీవితంలోని వివిధ దశల్లో తండ్రి, కుమారుడికి మధ్య బాధ్యతలు, సంరక్షణ కాలానుగుణంగా మారే తీరును ఆవిష్కరిస్తుంది. తండ్రి తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకుంటూ, భరోసానిచ్చేలా హత్తుకునే దృశ్యంతో ఈ ప్రచార చిత్రం ప్రారంభమవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు