Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి – కె.రామకృష్ణ

రాజుపాలెంలోని పులిచింతల పునరావాస కేంద్రంలో మానసిక దివ్యాంగురాలు 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన అదే ప్రాంతానికి చెందిన లాబు, సంజయ్ లను వెంటనే కఠినంగా శిక్షించాలని, గుంటూరులో జరిగిన బిటెక్ విద్యార్థిని రమ్య హత్య మరవకముందే ఇలాంటి ఘటనలు పునరావృతం అవడం చూస్తుంటే రాష్ట్రంలో మహిళలకు,ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇన్ని అత్యాచార ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైన లేదని, దిశ చట్టం – నిర్భయ చట్టం ఆడపిల్లలకు రక్షణ కవచంలా పనిచేస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే చెప్పడం, ఈ ఘటనలు చూస్తుంటే వారి మాటలకు చేతలకు పొంతన కనబడటం లేదని అన్నారు.
శుక్రవారం(ఈ రోజు) గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను వారి తల్లిదండ్రులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, చల్లా మరియ దాస్, సమితి సభ్యులు వలి, చైతన్య,మంగా శ్రీనివాస్, దుపాటి వెంకట రత్నం, జైద్, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img