విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని చెరువులో పి ఎం ఎం ఎస్ వై పథకం ద్వారా ఉచితంగా చేప పిల్లలను ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి కలిసి చేప పిల్లలను చెరువులోకి వదిలేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రజా సంక్షేమ పథకం ద్వారా న్యాయం చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా మత్స్యకారుకులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో నడుపుతానని వారు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఎన్నో ఇబ్బందులకు గురికావడం జరిగిందని, ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు.
చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి
RELATED ARTICLES