ఛాంపియన్స్ ట్రోఫీ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది అనగా పాకిస్తాన్ కొత్త వివాదానికి తెరలేపింది. కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంపై భారత జెండా లేకుండానే ప్రారంభ వేడుకలకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అన్ని దేశాల జాతీయ పతాకాలు స్టేడియంలో ఎగురవేయడం ఆనవాయితీ. మొత్తం ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. భారతదేశ జాతీయ పతాకం మినహా మిగతా అన్ని దేశాల జెండాలు కనిపించాయి. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది అనగా పాకిస్తాన్ కొత్త వివాదానికి తెరలేపింది. కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంపై భారత జెండా లేకుండానే ప్రారంభ వేడుకలకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అన్ని దేశాల జాతీయ పతాకాలు స్టేడియంలో ఎగురవేయడం ఆనవాయితీ. మొత్తం ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. భారతదేశ జాతీయ పతాకం మినహా మిగతా అన్ని దేశాల జెండాలు కనిపించాయి. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. కరాచీ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఇండియన్ ఫ్లాగ్ మిస్సయినట్లు కొందరు గమనించారు. వెంటనే అక్కడ ఉన్న మిగతా ఏడు దేశాల జాతీయ జెండాల వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ఉద్దేశ పూర్వకంగానే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కరాచీ స్టేడియంపై ఎగురవేయలేదని టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అయితే, పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దాంతో భారత మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ -2023కి తాము భారతదేశానికి వచ్చినప్పుడు.. వాళ్లెందుకు తమ దేశానికి రారంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పట్లో ఐసీసీ ముందు వాదన కూడా వినిపించింది. ఇదే విషయంలో దాదాపు నెలరోజుల పాటు ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగాయి. పాక్‌కి వెళ్లేందుకు ఇండియన్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం, బీసీసీఐ కూడా తలొగ్గక పోవడం.. ఛాంపియన్స్ ట్రోఫీని మరో దేశానికి మారుస్తామని ఐసీసీ చెప్పడంతో హైబ్రిడ్ విధానానికి పాక్ ఒప్పుకోక తప్పలేదు.
అప్పటి నుంచి టీమిండియాపై గుర్రుగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్‌కు కావాలనే చురకలు అంటించేందుకు కరాచీ స్టేడియంపై ఇండియన్ ఫ్లాగ్‌ను ఏర్పాటు చేయలేదు. పీసీబీ చేసిన ఈ చర్యతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
పాక్ కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొట్టే చర్యలు చేయడంతో ఫిబ్రవరి 23న భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ మరింత హై ఓల్టేజ్‌గా మారనుంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్లను నవ్వుతూ పలకరించొద్దు, వారితో గ్రౌండ్‌లో ఫ్రెండ్లీగా ఉండొద్దంటూ పాక్ ప్లేయర్లకు ఆ దేశ మాజీ ఆటగాళ్లు ఒకరకంగా వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల్లో భారతీయ జెండా కనిపించకుండా చేసి ఈ సారి జరిగేది మ్యాచ్ కాదు వార్ అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు.