విశాలాంధ్ర -ధర్మవరం ; కూచిపూడి కళా కేంద్రం ధర్మవరం పి ఆర్ టి వీధిలో ఈనెల 21, 22, 23వ తేదీలలో రాష్ట్రస్థాయి నిత్యోత్సవాలలో మూడు రోజులు పాటు నృత్య సదస్సులు నృత్య ప్రసంగములు నృత్య ప్రదర్శనలు నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు గురువు, కన్వీనర్ నటరాజ కృష్ణమూర్తి, కీర్తన తెలిపారు. ఈ సందర్భంగా కూచిపూడి కళా కేంద్రంలో 40 మంది నృత్య కళాకారులు ప్రాక్టీసును చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నృత్య ఉత్సవాలు కూచిపూడి కళాకేంద్రం- ధర్మవరం, భారతీయ నృత్య సంస్థాన్ అనుబంధ సంస్థ, యోగి వేమన విశ్వవిద్యాలయం- కడప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అభ్యసన నృత్య ప్రదర్శనలను గురువులు స్వయంగా ప్రాక్టికల్ గా నిర్వహించామనీ తెలిపారు. అంతేకాకుండా మా కూచిపూడి కళా కేంద్రం యోగివేమన విశ్వవిద్యాలయం కడప వారిచే గుర్తింపు పొందిన సంస్థగా వారు తెలిపారు. ఇప్పుడు మా వద్ద శిక్షణ పొందిన వారు యూనివర్సిటీ నిర్వహించే పలు నృత్యపరీక్షలను రాయడం జరుగుతుందని తెలిపారు. ఈ నిత్యోత్సవాల్లో 8 బృందాలు పాల్గొంటారని తెలిపారు. ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే ఈ పోటీలు పట్టణంలోని సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల యందు, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ ఆడిటోరియం నందు నిర్వహిస్తామని తెలిపారు. నృత్య నాటికలలో మహిషాసుర మర్దిని, రాధిక శాంత్వనము, మోహిని భస్మాసురా ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9493163544, లేదా 9440 209955 కు సంప్రదించాలని తెలిపారు .
రాయలసీమ నృత్యోత్సవాలు.. కూచిపూడి కళా కేంద్రం
RELATED ARTICLES