Sunday, February 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమృతి చెందిన కుటుంబాలకు బాడీ ఫ్రీజర్ బాక్స్ ఉచితం..

మృతి చెందిన కుటుంబాలకు బాడీ ఫ్రీజర్ బాక్స్ ఉచితం..

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పేదల కుటుంబాలలో ఎవరైనా మృతి చెందితే, వారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ ను పంపిణీ చేస్తామని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అన్నదానం, ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు సేవా కార్యక్రమం, విద్యా వైద్య విధానములో కూడా పలు సేవలను చేయడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. కావున ఈ ఫ్రీజర్ బాక్స్ ను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రవాణా ఖర్చు అభ్యర్థులే భరించాలని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్.. 8019859380కు గాని 9491120502 గాని సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు