ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్.
విశాలాంధ్ర ధర్మవరం:: త్వరలో జరగబోయే పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులలో పరీక్ష భయాన్ని తొలగించడానికి మోడల్ పరీక్షను పట్టణంలోని బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో మోడల్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఎస్ఎఫ్ఐ యుటిఎఫ్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అనేకమంది విద్యార్థులు ఒత్తిడిని అధికమించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి విద్యార్థులలో అవగాహన కల్పించడం కోసం పబ్లిక్ పరీక్షలు పట్ల భయాన్ని తొలగించడం కోసం ఈ పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రశ్న పత్రాలను అత్యంత అనుభోగములైన ఉపాధ్యాయులచే రూపొందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పబ్లిక్ పరీక్షల సమయంలో ఆరోగ్య విషయాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి విషయాలను కూడా వారు వివరించడం జరిగిందని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దన్న, ఎస్హెచ్ భాష, హరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజ్ఞా వికాస్ పరీక్షలు జయప్రదం
RELATED ARTICLES