Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసాయిబాబా దేవాలయమునకు వినాయక ముఖ కవచం విరాళం ఇచ్చిన దాతలు

సాయిబాబా దేవాలయమునకు వినాయక ముఖ కవచం విరాళం ఇచ్చిన దాతలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయి నగర్ లో గల షిరిడి సాయిబాబా దేవాలయమునకు పట్టణంలోని తబ్జుల్ రవి ప్రకాష్ వారి కుటుంబ సభ్యులు వినాయక ముఖ కవచమును తయారుచేసి ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ తాము ఈ బాబా గుడికి ఇవ్వాలన్న తలంపుతోనే భక్తిగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వినాయక వెండి కవచములు 360 గ్రాములు, విలువ 42 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వీరనారాయణ, నారాయణ రెడ్డిలు దాతల పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు