Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ నిరసన .. ఎందుకంటే..!

పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ నిరసన .. ఎందుకంటే..!

సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మనోజ్ తిరుపతిలోని విద్యాసంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ పోలీసుల తీరును నిరసిస్తూ తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశాడు. సోమవారం రాత్రి 11.15 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఆయన పోలీస్ స్టేషన్ వద్దే భైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్‌వ్యాలీ రెస్టారెంట్‌లో బస చేశానని, పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించి స్టేషన్‌కు పిలిపించారన్నారు. తాను పోలీస్‌స్టేషన్‌కు వచ్చేసరికి ఎస్ఐ లేరని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అక్కడే బైఠాయించారు. అనంతరం సీఐ ఇమ్రాన్ బాషాతో మనోజ్ ఫోన్‌లో మాట్లాడారు. తాను ఎంబీయూ (మోహన్ బాబు యూనివర్సిటీ) విద్యార్ధుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు