కరెస్పాండెంట్ సురేంద్రబాబు
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు పట్టణములోని సాయి నగర్లో గల సూర్య హై స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని కరెస్పాండెంట్ సురేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మెహరు నిషా లోకేష్ ఎంపిక కావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే పలు పోటీ క్రీడాకారుల్లో మా విద్యార్థులు సత్తా చాటడం జరిగిందని తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, పాఠశాల విద్యార్థులు ఆ విద్యార్థులను అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సూర్య హై స్కూల్ విద్యార్థులు ఎంపిక..
RELATED ARTICLES