ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఆర్డీవో కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి స్పందన రావడం జరిగిందని ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని ఏడు మండలాలలో ధర్మవరం 3, బత్తలపల్లి 4, తాడిమర్రి 2, ముదిగుబ్బ 01, రామగిరి 0, కనగానపల్లి 1, చెన్నై కొత్తపల్లి 01, ఆఫ్‌లైన్ 3 మొత్తము వెరసి 15 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పట్టణ పరిధిలోని 40 వార్డులలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, సంబంధిత అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో రెండు దరఖాస్తులు రావడం జరిగిందని వారు తెలిపారు. పట్టణ సమస్యలపై పట్టణ ప్రజలు ఎప్పుడైనా సరే తమకు ఫిర్యాదు చేయవచ్చునని, శానిటరీ సెక్షన్ విభాగంలో ప్రత్యేక శ్రద్ధను ఘనపరుస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పట్టణంలో ఎవరైనా భవన నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా పురపాలక సంఘ కార్యాలయం నుండి టౌన్ ప్లానింగ్‌ను తప్పక అనుమతి తీసుకోవాలని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి స్పందన
RELATED ARTICLES