చత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సంఘం
విశాలాంధ్ర ధర్మవరం ; చత్రపతి శివాజీ 398వ జయంతి ఉత్సవ వేడుకలను విజయవంతం చేయాలని చత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సంఘము, సకుల సాలే సమాజము, అంబా భవాని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని సాలే వీధిలో గల అంబా భవాని దేవాలయంలో ఈ వేడుకలు యొక్క పూజలు నిర్వహిస్తామని తెలిపారు. విశిష్ట అతిథిగా ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ కుండా చౌడయ్య, స్వకుల సాలె మహిళా సంఘం అధ్యక్షురాలు గాయ క్వాడే చంద్రకళ, మాజీ మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ ప్రకాష్, అనిల్ కదం, జి. గంగాధర, వెంకటేశులు, సరోధి కృష్ణమూర్తి హాజరవుతున్నట్లు తెలిపారు. జ్యోతి ప్రజ్వలన, శివాజీ చిత్రపటం ఆవిష్కరణ, తదుపరి శివాజీ చిత్రపటంతో బ్రహ్మోత్సవం, మండల పరిధిలోని గొట్లుర్ లో గల విగ్రహానికి చీరాభిషేకం పుష్ప అలంకరణ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జి, గంగాధర్, ఉపాధ్యక్షులు మరాఠా జాదవ్ హరి, సహకార దర్శి జుజారు నాగరాజు, గౌరవ అధ్యక్షులు సరోదే కృష్ణమూర్తి, కేహెచ్. రాజా, కే హెచ్. జగదీష్ పాల్గొన్నారు.
చత్రపతి శివాజీ 398 వ జయంతి వేడుకలు జయప్రదం చేయండి..
RELATED ARTICLES