Friday, February 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంవైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి

జి జి హెచ్ సూపర్డెంట్ కే ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర -అనంతపురం : వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జి జి హెచ్ సూపర్డెంట్ కే ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున ,సి.ఎస్.ఆర్. యమ్.ఓ డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ ఆర్ఎంవోస్ డాక్టర్ హేమలత, డాక్టర్ పద్మజ , నర్సింగ్ సూపరింటెండెంట్ నాగమణి , ఈ సమావేశంలో సిబ్బందిని ఉద్దేశించి సిబ్బందికి పై అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిబ్బంది అవినీతికి పాల్పడకూడదని అదేవిధంగా సమయపాలన పాటించాలని అందరూ ఖచ్చితముగా డ్రెస్ కోడ్ ను పాటించాలని అన్నారు. విధులకు హాజరైనప్పుడు మత్తు పదార్థాలను ఆల్కహాల్ తీసుకొకూడదు అని సూచించారు. ఈ సమావేశం లో ఎఫ్.ఎన్.ఓ, మరియు ఎమ్.ఎన్.ఓ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు