ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తమ విధులను నిర్వర్తించాలని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తదుపరి పలు రికార్డులను వారు పరిశీలించారు. రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో వారు నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట ప్రకారమే సబ్ రిజిస్టర్ పనులు చేయాల్సి ఉందని, లంచాలకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవని వారు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాలయం సజావుగా నడిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తదుపరి నియోజకవర్గంలోని బత్తలపల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని వారు తనిఖీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని తాసిల్దార్ కు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించాలి
RELATED ARTICLES