ముంబయి : లండన్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ నథింగ్ మంగళవారంనాడు ఫోన్ (3ఏ) సిరీస్‌లో ప్రో-లెవెల్ కెమెరా సిస్టమ్ ఉంటుందని ప్రకటించింది. అది వాడుకదారులు ఏ వాతావరణంలో అయినా సరే నిజమైన స్మార్ట్‌ఫోన్ ఫోటోలు మరియు వీడియోలను తీసుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఫోన్ (3ఏ) సిరీస్ కొత్త పెరిస్కోప్ లెన్స్‌ను ఏఐ స్పష్టతను పెంచే అల్గారిథమ్‌లతో సమ్మిళితం చేస్తూ ఒక ఫ్లాగ్షిప్ ఫోటోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ లాగా పనితీరును కనబరుస్తుంది. ఇంతకు మునుపు ఉన్న తన ఫోన్ (2ఏ)తో పోలిస్తే ఫోన్ (3ఏ) సిరీస్ కెమెరా గణనీయమైన మెరుగుదలలను కలిగి ఉంటుంది. దీని అత్యంత ముఖ్యమైన ఆధునీకరణలలో, 50ఎంపీ పెరిస్కోప్ లెన్స్‌ను జోడిరచడం అనేది ఒకటి. ఇది ప్రస్ఫుటమైన, వివరణాత్మక మాక్రో షాట్లను, 70 ఎంఎం పోర్ట్రెయిట్ -కచ్చితమైన దృష్ట్యాత్మక నిడివిని అందిస్తూ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 6ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్, 60ఎక్స్ అల్ట్రా జూమ్‌ను అందజేస్తుంది.