జిల్లాపరిపాలన అధికారి అలెగ్జాండర్ కు అందజేసిన ఎఐవైఎఫ్ ఏ పి ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్
విశాలాంధ్ర- అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని జిల్లాపరిపాలన అధికారి అలెగ్జాండర్ కి ఎఐవైఎఫ్ ఏ పి ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తొలి సంతకం చేయడం జరిగిందన్నారు. కానీ నేటికీ నోటిఫికేషన్ వేలువడ లేదన్నారు. నోటిఫికేషన్ లేక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు వేచించి కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురై నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అసలు వస్తుందో రాదు అని అయోమయ పరిస్థితిలో పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు,ప్రకాశం,అల్లూరు సీతారామరాజు జిల్లాలకు పోస్టులు ఎంపిక విషయంలో అన్యాయం జరిగిందని తక్కువ పోస్టుల మంజూరు చేశారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. 16,347వేల పోస్టులు కాకుండా 25వేలతో మెగా డీఎస్సీ నిర్వహించేలా చూడాలని నిరుద్యోగ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అనంతరం త్వరితగతిన డీఎస్సీ నోటిఫికేషన్ అన్ని వివరాలతో వెలువడేలా చూడాలని తక్షణమే మెగా డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే లా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రెష్ అనంతపురం జిల్లా ఉప అధ్యక్షులు కార్యదర్శులు దేవేంద్ర, ధనుంజయ్, రాష్ట్ర సమితి సభ్యులు మురళి, ఏ ఐ వై ఎఫ్ అనంతపురం నగర కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు