విశాలాంధ్ర- ధర్మవరం : ప్రజలందరూ భక్తి భావనతోనే ఉన్నప్పుడే మనశ్శాంతి, చక్కటి సంతోషం, తృప్తి లభిస్తుందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పోలమడ రూప రాగిణి, కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ పిన్ను ప్రసాద్, యువజన సంఘం అధ్యక్షులు దేవతా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేపిటివీధిలోని కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో వాసవి మాత ప్రతిష్ట జరిగి 22 సంవత్సరాలు పూర్తి అయి 23వ సంవత్సరములో అడుగు పెట్టిన సందర్భంగా వేడుకలను ఆర్యవైశ్యులు, వాటి అనుబంధ సంస్థ వారు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య అనుబంధ సంస్థ కమిటీ వారు, భక్తాదులు పాల్గొన్నారు.
భక్తి భావనతోనే మనశ్శాంతి లభిస్తుంది.. ఆర్య వైశ్యులు
RELATED ARTICLES