Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైతుల నుండి కొనుగోలు చేసిన కందులకు నగదును తక్షణమే రైతు ఖాతాలో జమ చేయండి

రైతుల నుండి కొనుగోలు చేసిన కందులకు నగదును తక్షణమే రైతు ఖాతాలో జమ చేయండి

జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన జిల్లా రైతు సంఘం ప్రధానకార్యదర్శి సి. మల్లికార్జున
విశాలాంధ్ర -అనంతపురం : రైతుల నుండి కొనుగోలు చేసిన కందులకు నగదును తక్షణమే రైతు ఖాతాలో జమ చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేసిన జిల్లా రైతు సంఘం ప్రధానకార్యదర్శి సి. మల్లికార్జున అందజేశారు. ఈ సందర్భంగా సి. మల్లికార్జున మాట్లాడుతూ…. ఆంద్రప్రధేశ్ రైతు సంఘం జిల్లాసమితి ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం నందు రైతులు కొనుగోలుకు కేంద్రాల్లో అమ్మిన కందులకు నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ కు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్ ,జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు పి రామకృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.
జిల్లాలో కంది పంటను మంచి దిగుబడి ఆశించి రైతులు సాగు చేస్తే కనీసం 6,7 రావాల్సిన దిగుబడి కేవలం ఒకటి,రెండు క్వింటాళ్లు రావడం జరిగిందని, అందువలన రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై గిట్టుబాటు ధర లేక నష్టపోవడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం రూ.7,550 కంది పంటకు మధ్ధతు ధర ప్రకటిస్తే ఏ మూలకు సరిపోవడం లేదు అందుకే రూ 2,450 బోనస్ ప్రకటించి రైతులకు క్వింటాకు రూ.10 వేలు ప్రకారం అందించాలన్నారు. అప్పుడే రైతులకి న్యాయం జరిగేది జిల్లాలో దాదాపుగా 50,వేలు హెక్టార్లల లో కందిపంటసాగుచేసిన చీడపీడలతో వర్షాభావంతో పూత పింద రాలిపోయి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అందుకోసం మార్కెపెడ్ ద్వారా కొనుగోలు చేసిన కందులకు తక్షణమే రైతుల ఖాతాలోనగధు జమ చేయాలి అని కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా అక్కడ ఉండే జిల్లా అధికారులకు మార్క్ ఫెడ్ అధికారులు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వారిని రమ్మని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారితో మాట్లాడి రైతులకు నగదును జమ చేసే విధంగా ఆదేశిస్తామని జిల్లా రైతు సంఘం కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు మధు యాదవ్, శ్రీకాంత్ ,ఏఐవైప్ జిల్లానాయకులు,ధను, అశోక్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు