ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో (పాతది) గత కొన్ని సంవత్సరాలుగా సిమెంట్ రోడ్డు లేకపోవడం వల్ల రోగులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులను ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతవరకు సిమెంట్ రోడ్డు, పంబ్లింగ్, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ తదిత ర పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రికి మరిన్ని నిధులు కావాలన్న ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాలప్ప నాయుడు, హెడ్ నర్సు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంటు రోడ్డు పనులు ప్రారంభం..
RELATED ARTICLES