పదివేల క్యూసెక్కులకు పెంచి ఆయకట్టుకు నీరు అందించాలి
నీటిని స్థీరీకరించాలి
శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్
విశాలాంధ్ర పుట్టపర్తి:-హంద్రీనీవా కాలువ సామర్థ్యం పెంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఆయకట్టుకు నీరు ఇస్తామని వాగ్దానం చేశాడన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ వెడల్పు చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ,30 లక్షల మందికి తాగునీరు, సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 50 సంవత్సరాలుగా పోరాడుతున్న ఆయకట్టు వరకు సాగునీరు అందించడం లేదన్నారు. హంద్రీనీవాకు సంబంధించి కాంక్రీట్ లైనింగ్ చేపట్టి రైతులను నష్టాలకు గురి చేస్తే సీపీఐ పార్టీ ఉద్యమాలకు సిద్ధమవుతుందన్నారు. మొదటి దశలో 14 టిఎంసిల నీటిని వాడుకోవలసి ఉండగా, కాలువ సామర్థ్యం లేక రైతుల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. హంద్రీనీవా కాలువ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నారు .చిత్తూరు, కర్నూలు ,అనంతపురం జిల్లా రైతాంగానికి సాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టులపై నిరాశ చూపిస్తున్నారన్నారు.రాయలసీమలోని హంద్రీనీవా సుజల స్రవంతిపై కూటమి ప్రభుత్వం మాటమార్చడం సరికాదన్నారు. రాయలసీమ ప్రజల మద్దతు కూడగట్టడానికి కూటమి నేతలు హంద్రీనీవా ప్రాజెక్టును తెరమీదకు తెచ్చిన విషయాన్ని విస్మరించడం మంచిది కాదన్నారు.తాము అధికారంలోకి వస్తే హంద్రీనీవా కాలువను పదివేల క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచుతామని, చివరి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని కూటమి నేతలు రైతుల నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. కర్నూలు జిల్లా మల్యాల నుండి చిత్తూరు జిల్లా కుప్పం వరకు కృష్ణా జలాలు మళ్లించడానికి హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు రైతుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. బనకచర్ల వరకు కాలువ తవ్వి గోదావరి నీళ్లు ఇస్తామంటున్న ముఖ్యమంత్రి హంద్రీనీవా కాలువ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నారన్నారు.30 ఏళ్లుగా కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లింపు వివాదం కొనసాగుతూనే ఉందన్నారు. ముఖ్యమంత్రులు మారినా రాయలసీమ రైతుల సమస్యలు మారడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాలం కాలం నాటి చెరువులు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. హంద్రీ నీవా ద్వారా నీటిని మళ్లించి చెరువులు నింపాలన్నారు. రాజకీయ నాయకులు రైతు సంఘాలు ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని కోరుతున్నామన్నారు. హంద్రీనీవా ద్వారా సాగునీరు , తాగునీరు అందించి రాయలసీమ కరువు ప్రాంతాన్ని ఆదుకోవాలని అన్నారు. హంద్రీనీవా దీర్ఘకాలిక సమస్యగా మారిందని 40 ఏళ్లు గా పోరాటం చేస్తున్న పరిష్కారానికి నోచుకోలేదన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో 2లక్షల 60 వేల ఎకరాలకు ఆయకట్టు సాగుకు తాగునీరు సాగునీరు అందించి ఉపకాలవల పనులను తక్షణమే చేపట్టి ఆ తర్వాతే కుప్పంకు నీరు తీసుకుపోవాలన్నారు. 100 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలన్నారు.
హంద్రీనీవా ఆధునీకరణ పనులు చేపట్టాలి.
హంద్రీనీవా ఆధునీకరణ పనులు చేపట్టాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్న ఇంతవరకు హంద్రీనీవా పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గత ప్రభుత్వం హంద్రీనీవాను పట్టించుకోకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంట పొలాలు బీళ్ళుగా మారాయన్నారు. కాలువకు లైనింగ్ నిర్మిస్తే నీటి వృథాను అరికట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించవచ్చు అన్నారు. ప్రధాన కాలువ విస్తరణ, చేపట్టి నీటి వృత్తాను నియంత్రించి రిజర్వాయర్లతోపాటు చెరువులకు నీరు నింపాలన్నారు.