Sunday, February 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ..

విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ..

డిప్యూటీ డి ఎం హెచ్ వో సెల్వియా సాల్మన్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు కంటి వైద్య చికిత్సలు జరుగుతున్నాయని, తదుపరి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేస్తున్నామని, ఇందులో భాగంగానే మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 21 మంది బాలికలకు ఉచితంగా కంటి అర్థాలను పంపిణీ చేయడం జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పుష్పలత, ఆప్తాల మీకు ఆఫీసర్ ఉరుకుందప్ప ఆధ్వర్యంలో కంటి అద్దాలను పంపిణీ చేయడం నిజంగా శుభదాయకమని తెలిపారు. ధర్మవరం మండలంలోని అన్ని పాఠశాలలోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని అందులో ఎవరికైతే అద్దాలు అవసరము అవుతాయో వారిని మాత్రమే ఎంపిక చేసి నివేదికను ఉన్నతాధికారులకు తెలపడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈరోజు కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థినీలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శివమ్మ ఎంఎల్ హెచ్ పి – అనిత ,ప్రిన్సిపాల్ చంద్రకళ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు