: సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం : వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో రూ.856. 66 కోట్ల నిధులు దుర్వినియోగం అయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాల కాలంలో బోగస్ పనులు బినామీ మస్టర్లు అదనపు చెల్లింపులు ఇతరత్రా మార్గాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిపి ఆ పార్టీ నేతలు దోచుకు తిన్నారన్నారు. సామాజిక తనిఖీల్లో వెలుగు చూసిందని నిందితుల చేసిన దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కీలక స్థానాలను అప్పటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుకూల అధికారులతో చెప్పినదానికల్లా పని చేయించుకునే వారన్నారు. దొంగ మస్టర్లు, బోగస్ పనులతో ఇష్టారాజ్యంగా ఉపాధి నిధులు దుర్వినియోగం అయిందన్నారు. 2019,20 సం లో 661 మండలాల్లో రూ.8,617 కోట్లతో పనులు చేపట్టారన్నారు. వీటిలో రూ.547.20 కోట్ల విలువైన పనులకు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద రికార్డులు కూడా లేవంటే నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థం అవుతోందన్నారు. రెండవ దశ పరిశీలన తర్వాత 410.98 కోట్లు దుర్వీనియోగమైనట్లు సామాజిక తనిఖీ బృందాలు నిర్ధారణకు వచ్చాయన్నారు . పక్కాగా తనిఖీ చేస్తే మరింత అవినీతి వెలుగులోకి వస్తుందన్నారు. విజయవాడలోని జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ములకత్ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరామర్శించి విలేకరులతో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసు అధికారులపై తీవ్ర విమర్శిస్తూ తాను పదవిలోకి రాగానే విశ్రాంతి ఉద్యోగులైన సరే సప్త సముద్రాలు దాటి పోయినా కూడా వెనక్కి రప్పించి నడి రోడ్డు మీద బట్టలు ఊడదీస్తామని చెప్పడం జరిగిందన్నారు. తన ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులే ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారన్నారు. ప్రజల భద్రత సేవలో భాగంగా 24 గంటలు పని చేస్తున్నటువంటి పోలీస్ శాఖపై ఇటువంటి వాక్యాలు చేయడం పై వారి మనోభావాన్ని దెబ్బతీసిన వారు అవుతారన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై సిపిఐ పార్టీ సరే అయింది కాదని అభిప్రాయపడుతున్నామన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ విషయంపై సిపిఐ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.