Friday, May 3, 2024
Friday, May 3, 2024

అమెరికాను ముంచెత్తిన ‘హెన్రీ’

22 మంది మృతి : కొట్టుకుపోయిన ఇళ్లు, రోడ్లు, వాహనాలు
న్యూయార్క్‌ : అమెరికా ఈశాన్య తీరంపై హెన్రీ తుపాను విరుచుకుపడు తోంది. భారీ వర్షాలు, వరదలతో దేశం అతలాకుతలమవుతోంది. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. వరద పోటుకు ఇప్పటికే 22 మంది మరణిం చినట్లు తెలిసింది. భారీ వర్షాల కారణంగా టెన్నెస్సీ నగరం కుదేలైంది. వరదలో వందలాది కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. చాలమంది గల్లంతయ్యారు. వరదల ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నీట మునగగా, మరికొన్ని కూలిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. టెన్నెసీలో రికార్డు స్థాయిలో 34.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. 1982 నుంచి ఈ స్థాయిలో వర్షం నమోదు కావటం ఇదే మొదటిసారిగా చెప్పారు. ఏడు అడుగుల మేర వరద ముంచెత్తడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొందరు చెక్కబల్లల సాయంతో వరదలో ఈదుకుంటూ బయట పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను టెన్నెసీ గవర్నర్‌ కోరారు. హెన్నీ తుపాను ప్రభావంతో న్యూయార్క్‌, న్యూజెర్సీ, మసాసుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌లలో భారీ వర్షాలు కురిశాయి. సముద్రం పోటెత్తుతుండగా, గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీశాయి. న్యూయార్క్‌లోని లాంగ్‌ ఐలాండ్‌లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img