విశాలాంధ్ర – హైదరాబాద్ : మీరే మహబూబ్ నగర్ రోల్ మోడల్స్, మీరు శక్తికి ప్రతి రూపం అని మహిళలూ9 మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలులో భాగంగా ఎమ్మెల్యే తన సొంత నిధులతో అందించిన వృత్తి నైపుణ్య శిక్షణను మొదటి బ్యాచ్‌లో 224 మంది మహిళలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడుకోలు సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ. డి.జానకి, ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి ప్రసన్నతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కార్యక్రమా న్ని మొదలు పెడితే ముందు కుటుంబానికి, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడుతుందనే ఒక మంచి ఆలోచన, సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. అందులో భాగంగానే మీలో దాగిన ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింద న్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం సైతం బాగుంటుందని, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందన్నారు. మహబూబ్‌నగర్‌లో టాలెంట్‌కు కొదవే లేదని మీరు నిరూపించారన్నా రు. మయూరి అనే బ్రాండ్‌ను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా విస్తరిస్తు న్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ ఎదగాలనే ఆశ ఆకాంక్ష మీలో నిండుగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే ఎంతో శ్రమకోర్చి తన సొంత నిధులతో మన మహబూబ్ నగర్‌లోని మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ నవరత్నాలు శిక్షణ సెంటర్‌లో శిక్షణ పొందిన మీరంతా కూడా మంచి స్థితిలో చేరుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని రూపొందించారో ఆ ఉద్దేశాన్ని మీరు నిజం చేయాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సెట్విన్ విజయ్ కుమార్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, శ్రీనివాస్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా,అంజద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండా మనోహర్, రాజు గౌడ్, ఖాజా, పోతన్ పల్లి మోహన్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఎస్‌ఓ శ్రీనివా స్, లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు.
శివాజీ ఆశయాలు కొనసాగిద్దాం…
ఛత్రపతి శివాజీ ఆశయాలు కొనసాగిద్దాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని పాలకొండ రోడ్ బైపాస్‌లో గల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శివాజీ అపజయం ఎరుగని వీరుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, శివుడు, ఆంజనేయులు, శ్రీనివాస్, చర్ల శ్రీనివాసులు, పి.నాగయ్య తదితరులు పాల్గొన్నారు.