ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య విశాలాంధ్ర -అనంతపురం : ఘనంగా మడవాల మాచయ్య జయంతి పురస్కరించుకొని బుధవారం ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనగానపల్లి మండలం లో తగరకుంట గ్రామంలో మడవాల మాచయ్య జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సి లింగమయ్య మాట్లాడుతూ… తగరకుంట గ్రామంలో మడవాల మాచయ్య జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించారన్నారు. తగరకుంట గ్రామంలో రజక సోదరీ సోదరులు మడవాల మాచయ్య జయంతి సందర్భంగా ఊరులో ఉదయం కార్యక్రమం చేసి బుధవారం సాయంత్రం మడవాల మాచయ్య పటాన్ని తీసుకొని ఊరంతా అంగరంగ వైభవంగా కనులు విందుగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. తగరకుంట గ్రామంలో మడవాల మాచయ్య జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఆ రజక సోదర సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.. మండల వ్యాప్తంగా రజక సోదరులు. తగరగుంట గ్రామ రజక సోదరులు పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో గ్రామ కార్యనిర్వకులు సన్న పోలప్ప, ఒన్నూరప్ప, వెంకటేష్, మల్లికార్జున, రామంజి, ముత్యాలు, రంజిత్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.