Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. హిందూపురం జిఆర్పి పోలీసులు

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. హిందూపురం జిఆర్పి పోలీసులు

విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని చెన్నై కొత్తపల్లి -ప్యాదిండి రైల్వే పట్టాలపై ధర్మవరం పట్టణానికి గిర్రాజు కాలనీ కు చెందిన ఎనుముల అశోక్ (32) మృతి చెందాడు. ఈ సందర్భంగా హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులు శ్రీనివాసులు, నాగరాజు మాట్లాడుతూ మృతుడు ఈ నెల 18వ తేదీ 10 గంటలకు ధర్మవరం పట్టణం నుండి చెన్నై కొత్తపల్లి లోని వారి బంధువులు ఇంటికి వెళ్లి, తదుపరి తన టు వీలర్ లో ప్యాదిండి సమీపన గల రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలిపారు. మృతుడు షేర్ మార్కెట్ తో జీవనం కొనసాగించేవాడని, ధర్మవరం లోని ఓ బ్యాంకులో ఎనిమిది లక్షల అప్పు తెచ్చి, తనకున్న దూర అలవాట్లతో, ఇంటిని కుదువ పెట్టి ఎనిమిది లక్షలు అప్పు తెచ్చుకున్నాడని, తదుపరి ఆ డబ్బు మొత్తం ఖర్చు అయిపోయినందున, అప్పు ఎలా తీర్చాలో తెలియక, విరక్తితో రైలు కింద పడి చనిపోవడం జరిగిందని (బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు) తెలిపారు. అంతేకాకుండా ఆన్లైన్లో బెట్టింగ్ కూడా ఆడే వారిని తెలిపారు. లోకో పైలట్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి తాము చేరుకోవడం జరిగిందని, అక్కడ ఉన్న టు వీలర్ నెంబరు, పక్కనే గల సెల్ నెంబర్ తో మృతుడి ఆచూకీ కనుగొనడం జరిగిందని తెలిపారు. సమాచారాన్ని కుటుంబ బంధువులకు తెలపగా, వారు ఎనుముల శ్రీనివాసులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. మృతుడికి ఏడు సంవత్సరాల క్రితం వివాహమైందని, సంతానం లేదని తెలిపారు. మృతుని భార్య ధరణి అని తెలిపారు. తదుపరి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్ట్మాస్టర్ అనంతరం కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు. తదుపరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు