విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బీసీ లోన్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క విద్యార్హత కుల, ఆదాయం తదితర సర్టిఫికెట్లను ఎంపీడీవో సాయి మనోహర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ బ్యాంకుల మేనేజర్లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో సాయి మనోహర్ మాట్లాడుతూ మొత్తం ఈ బీసీ లోన్లకు 673 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీ, 19వ తేదీ దరఖాస్తుల పరిశీలనలో 512 మంది లబ్ధిదారులు హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఈ లోన్ల దరఖాస్తుల పరిశీలన సజావుగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి లబ్ధిదారుడు సబ్సిడీ కోసం కాకుండా ఇండస్ట్రీ యూనిట్ స్థాపించాలన్న ధ్యేయంతో అందరూ ముందుకు రావాలని వారు తెలిపారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో భాగంగా ఈ లోన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. స్వయం ఉపాధి పనులు చేయి తొ కొరకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ బీసీ లోన్ల ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉపాధిని కల్పించుకొని తమ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం రావడం మంచి శుభదాయకమని తెలిపారు. తదుపరి వివిధ బ్యాంకుల మేనేజర్లు ఈ లోన్ల ప్రక్రియపై తగు సూచనలు ఇచ్చి, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం సుఖవంతమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, పట్టణ వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
ముగిసిన బీసీ లోన్ల లబ్ధిదారుల దరఖాస్తులు పరిశీలన.. ఎంపీడీవో సాయి మనోహర్
RELATED ARTICLES